Back
Description:
CHARIOT FESTIVAL
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
1000
1000
Event Date:
18-Nov-2023
18-Nov-2023
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Nagara(Nama) Sankeerthana
Nagara(Nama) Sankeerthana
Event Sub Category2:
Sri Sathya Sai Pallaki Seva
Sri Sathya Sai Pallaki Seva
No Of Hours:
3:00:00
3:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHA RAO
HANUMANTHA RAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao947@gmail.com
nvhrao947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు
బ్రహ్మాండనాయకుని రధోత్సవం - 18.11.23
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి 98 వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా, గుంటూరు శ్రీ సత్య సాయి సేవా సమితి తేదీ 18.11.23 శనివారం సాయంత్రం 3.30 గంటల నుండి , అఖిల జగత్తుకు బ్రహ్మాండనాయకుడైన శ్రీ సత్య సాయి చిత్రపటమును ప్రత్యేకముగా అలంకరించిన రథముపై ప్రతిష్టించి రంగ రంగ వైభవంగా గుంటూరు పురవీధులలో ఊరేగింపు నిర్వహించబడినది. ముందుగా జిల్లా అధ్యక్షులు శ్రీ కే. నారాయణరావు గారి నేతృత్వంలో శ్రీ సత్య సాయి శాంతి సుధ లో సాంప్రదాయ అర్చనలు నిర్వహించి, విద్యార్థుల బ్యాండ్ వాయిద్యాలతో, మంగళ హారతులతో, శ్రీ సత్య సాయి విద్యా విహార్ (జడ్పీ. కాంపౌండ్) శ్రీ సత్య సాయి విద్యా విహార్ (నవాలయ క్యాంపస్) శ్రీ సత్య సాయి విద్యా నికేతన్ ఆర్. అగ్రహారం, శ్రీ సత్య సాయి ఐడీఎల్ స్కూల్ చౌత్ర సెంటర్ కు చెందిన 400 మంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది, భక్తులు జయ జయ ద్వానాల మధ్య , భక్తుల దర్శనార్ధం, ఎవరైతే తన దర్శనం పొందలేని వారున్నారో వారికి తానే స్వయముగా నడచివచ్చి అనుగ్రహ ఆశీస్సులు వర్షింపజేయుటకు పరవీధులగుండా కదలినారు. ప్రశాంతి నిలయం లో స్వామి జన్మదినోత్సవానికి ముందు ప్రతి సంవత్సరం నవంబరు 18 వ తారీఖున రధోత్సవం స్వామి స్వయంగా నిర్వహించే వేడుకను కొన్ని దశాబ్దాలనుండి కొనసాగుచున్నది. అదేరీతిలో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ప్రతి సంవత్సరం నవంబర్ 18 వ తారీఖున అన్ని ప్రదేశములలో అవకాశము మేరకు నిర్వహింపబడుచున్నవి.
ఆగమ శాస్త్రము లో రధోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత మరియు విశిష్టంగా వీక్షించినవారికి మోక్ష ప్రదాయకంగా భావిస్తారు. సంప్రదాయంగా దేవతా మూర్తుల ఉత్స విగ్రహాలకు కళ్యాణం జరిపి, కల్యాణోత్సవంగా పుర జనులకు దంపతసమేతంగా భగవంతుడు దర్శనం అనుగ్రహ ప్రాప్తి కలుగజేయబడుతుంది. గుంటూరు జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ కే. నారాయణరావు గారి నేతృత్వంలో తేదీ 11.11.23 నవ (9) దేవతా మూర్తులకు కళ్యాణం జరిపించిన సంగతి విదితమే. సకల దేవతాతీత స్వరూపుడైన భగవాన్ బాబా వారి రధోత్సవం ఈ సందర్భముగా జరపడం గుంటూరు ప్రజల అదృష్టము.
రధోత్సవంలో గుంటూరు శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ ముందు నడువగా వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్ మరియు 400 మంది విద్యార్థులు సిబ్బంది, భక్తులు, జయ జయ ద్వానాలతో కోలాహలంగా గంట సేపు రధోత్సవం నివహించి తిరిగి శ్రీ సత్య సాయి శాంతి సుధ కు జే రుకుని, స్వామి కి మంగళ హారతులొసంగి, యధాస్థానంలోనుంచిరి. ప్రసాద వితరణతో కార్యక్రమము ముగించబడినది.
(కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు )




.jpeg)
