Back

12-10-2021 navaratri 6th day, Goddess Saraswathi Avatar, distribution of slates,books,pencils etc to needy children (449) in Guntur dt


District:  
Guntur
Samithi:
District Level
No Of Beneficiaries:
469
Event Date:
12-Oct-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Others
No Of Hours:
20.00
Location:
dist level
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం 

 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, గుంటూరు జిల్లా 


 

దేవీ నవరాత్రి ఉత్సవాల 6వ రోజు సరస్వతి దేవి పూజ - చిన్నారులకు పలకలు, రంగు రంగుల బలపాలు, నోట్ పుస్తకాలు, రబ్బర్లు, షార్పెనర్లు

 

భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో  జిల్లా వ్యాప్తంగా స్వామి వారి మందిరాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి రోజు ఎంతో భక్తి శ్రధ్ధలతో, వైభవంగా నిర్వహించబడుతున్నవి. 

 

రాష్ట్ర మహిళా విభాగం అక్టోబరు సేవా పుష్పాలలో సూచించిన విధంగా 12.10.2021వ తేదీన వివిధ ప్రదేశాల్లోని స్వామి మందిరాలలో అమ్మవారిని సరస్వతి మాతగా అలంకరించి, మహిళలు, చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

ఈ సందర్భంగా నిర్వాహకులు చిన్నారులకు పలకలు, రంగు రంగుల బలపాలు, నోట్ పుస్తకాలు, రబ్బర్లు, షార్పెనర్లు బాహుకరించారు. 

 

1) కొప్పర్రు సమితి పరిధిలోని ప్రత్తిపాడు భజన మండలి  

 

ప్రత్తిపాడు భజన మండలి బాలవికాస గురువులు, ప్రత్తిపాడు లోని 10 అంగన్వాడీ సెంటర్లలో 200 పిల్లలకు 20 బాక్సుల పెన్సిల్స్ (200 నెంబర్లు), 20 బాక్సుల రబ్బర్లు (200 నెంబర్లు), 10 షార్పెనర్స్, 10 బాక్సుల స్లేట్ పెన్సిల్స్ (రంగు రంగుల బలపాలు)ను అంగన్వాడీ టీచర్లకు అందచేశారు. 

 

అంగన్వాడీ టీచర్లు ఎంతో ఆనందంగా, వెంటనే ఎంతో ఆప్యాయతతో పిల్లలకు పంపిణి ప్రారంభించారు. 

 


 

2) చిలకలూరిపేట  సమితి :

 

దేవీ నవరాత్రి ఉత్సవాల 6 వ రోజు ఉదయం, 110 మంది చిన్నారులచే మహిళా విభాగం వారు  సరస్వతి మాతకు పూజ నిర్వహించారు.  చిన్నారులకు ప్రతి ఒక్కరికి అమ్మవారి వద్ద పూజలో ఉంచిన  లాంగ్ నోటుబుక్స్, పెన్నులు బహుకరించారు. 

 




 

3) గుంటూరు సమితి 

 

శ్రీ సత్య సాయి శాంతి సుధా మందిరంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కె.నారాయణరావు గారి స్వీయ పర్యవేక్షణలో దేవీనవరాత్రి ఉత్సవాలు ప్రతి రోజు ఎంతో వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. 

 

దేవీ నవరాత్రి ఉత్సవాల 6 వ రోజు సాయంత్రం శాంతి సుధా ప్రాంగణంలోని శ్రీ సత్యసాయి విద్యా విహార్ ప్రిన్సిపాల్ గారు, మహిళా సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి మాత పూజలో పాల్గొన్నారు.  పూజలో ఉంచిన లాంగ్ నోట్ బుక్స్, పెన్నులు 25 మంది  విద్యార్థిని, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి  బహుకరించబడినవి. 

 


 

4) కారంపూడి భజన మండలి 

 

కారంపూడి భజన మండలి సత్యసాయి మందిరం లో  దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు.  ఉత్సవాల 6 వ రోజు  సరస్వతి అమ్మవారి పూజలో షుమారు 60 మందికి పైగా చిన్నారులు తమ తల్లులతో పాల్గొన్నారు.  నిర్వాహకులు 30 మంది చిన్నారులకు స్లేట్స్, స్లేట్ పెన్సిల్స్, 50 మంది స్కూలు విద్యార్థిని విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ బహుకరించారు. 

 


 

5) పిడుగురాళ్ల  సమితి 

 

పిడుగురాళ్ల సమితి వారు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రధ్ధాలతో నిర్వహిస్తున్నారు.    6 వ రోజు 12. 10. 2021 తేదీ మహిళలు, చిన్నారులు సరసతీ  దేవి పూజ లో పాగొ న్నారు.  14 మంది చిన్నారులకు లాంగ్ నోట్ బుక్స్, పెన్సిల్స్ బహుకరించబడినవి. 

 


 

6) నందివెలుగు భజన మండలి 

 

నందివెలుగు భజన మండలి వారు, నవరాత్రి పర్వదినములలో ప్రతి రోజు నగర సంకీర్తన, అమ్మవారికి అభిషేకం, అలంకరణ, పూజ, తదుపరి భజన నిర్వహిస్తున్నారు.   6 వరోజు 12.10. 2021 తేదీన 20 మంది చిన్నారులచే  అమ్మవారికి పూజ చేయిచి, వారికి నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్నులు బహూకరించారు . 

దుర్గి భజన మండలి 

 

7) దుర్గి భజన మండలి 

 

దుర్గి భజన మండలి వారు ప్రతి రోజు దేవీ  నవరాత్రి ఉత్సవాలు ఘనంగా, భక్తి శ్రధ్ధలతో నిర్వహిస్తున్నారు.   12.10.2021 తేదీ సరస్వతి మాత అమ్మ వారికి 20 మంది చిన్నారులచే పూజ చేయించారు.  అమ్మవారి వద్ద పూజలో ఉంచిన నోట్  పుస్తకాలు, పెన్సిళ్లు చిన్నారులకు అమ్మవారి బహుమతిగా ఇచ్చ్చారు.   

 


 

జిల్లాలో శ్రీ సరస్వతీ మాత  పూజలో పాల్గొన్న మొత్తం చిన్నారులు 469 

 

చిన్నారులందరికీ సాయి మాత  శుభాశీస్సులు ఎల్లవేళలా అందచేయాలని ప్రార్థిస్తూ... 



 

సదా సాయి సేవలో...




 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved