అవతారపురుషుని ఆనందోత్సవ వేడుకలు
Nellore
District Level
120
26-Feb-2022
Spiritual Care
Festivals/Vrathams/Homams
03:00:00
Nellore
K.Mallikarjuna Rao
6304001359
mallikgitha79@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం!
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 26-2-2022న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, నెల్లూరు జిల్లా వారు జిల్లా వ్యాప్తముగా ఆధ్యాత్మిక, విద్యా, సేవా మరియు యువ విభాగములన్నియు కలిసి ముఖ్యముగా సాయి సోదరీమణులందరూ " అవతారపురుషుని అనందోత్సవ వేడుకలు" అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి భజన మందిరము, రామమూర్తి నగర్, నెల్లూరు నందు జరుపుకున్నారు.
10 సమితులనుండి 4 విభాగాల సాయి సోదరీమణులు, సోదరులు ఉదయము 10.30 గంటలకు మందిరానికి విచ్చేసి స్వామివారిని, వారి దివ్య పాదులకను పల్లకిలో అలంకరించి మందిరము చుట్టూ మంగళవాయిద్యములతో ఊరేగింపుగా కొనసాగి, వేదపఠనముతో మందిర ప్రవేశము చేశారు. భజన కార్యక్రమము మొదలయ్యింది. తదుపరి స్వామివారి దివ్యపాదుకా పారాయణ యొక్క విశిష్టతను వివరిస్తూ పాదుకాష్టక పారాయణము అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
తర్వాత ఉయ్యాల ఉత్సవము యొక్క అంతరార్థమును వివరిస్తూ, స్వామివారిని ఉయ్యెలలో ఆశీనులను గావించి, ఉయ్యాల పాటలు పాడుతూ ఎంతో వైభవముగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. స్వామివారి అవతార వైభవాన్ని గురించి సత్సంగము చేశారు. స్వామివారికి మహామంగళ హారతితో కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సవాలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమములో సుమారు 120 మంది భక్తులు పాల్గొన్నారు-
జై సాయిరాం
