Back
Description:
2023 సంవత్సరంలో చేయబోవు కార్యాచరణ ప్రణాళిక అవిష్కరణ
District:
Parvathipuram Manyam
Parvathipuram Manyam
Samithi:
PALAKONDA
PALAKONDA
No Of Beneficiaries:
500
500
Event Date:
25-Dec-2022
25-Dec-2022
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Others
Others
No Of Hours:
06:00:00
06:00:00
Location:
Palakonda
Palakonda
Reported By:
Rajkumar
Rajkumar
Mobile No:
8985038371
8985038371
Email Id:
rajbpharm20067172@gmail.com
rajbpharm20067172@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవాసంస్థలు, పార్వతీపురం మన్యం జిల్లా
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ దినం క్రిస్మస్ రోజున పార్వతీపురం మన్యం జిల్లా పదాధికారులు ,కన్వీనర్లు మరియు క్రియాశీలక కార్యకర్తల సమావేశం శ్రీ సత్యసాయి సేవా సమితి పాలకొండలో 9 గం 30 నిలకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణ్ రావు గారు పతాకావిస్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిరి. తదుపరి సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ముందుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పి నేతాజీ నాయుడు గారు ఉపన్యసిస్తూ స్వామి ప్రేమ తత్వాన్ని మనం ఎంతగా ఆస్వాదిస్తే అంతగా పదిమందికి పంచగలమని అప్పుడు మాత్రమే మన జీవితాలకి సార్ధకత ఉంటుందని తెలియజేశారు.
తదుపరి జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ శ్రీనివాస గారు సేవాదళ్ సమన్వయకర్త శ్రీ రాజశేఖర్ గారు విద్యా సమన్వయకర్త శ్రీ మోహనరావు గారు, యువజన సమన్వయకర్త సాయి అనిల్ గారు జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటివరకు తమ తమ విభాగాలు ద్వారా నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టును సభ ముందు ఉంచడం జరిగింది.
తదుపరి 2023 సంవత్సరంలో చేయబోవు కార్యాచరణ ప్రణాళిక ను శ్రీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు గారు జిల్లా అధ్యక్షులు శ్రీ నేతాజీ నాయుడు గారు సంయుక్త విజయనగరం జిల్లా పూర్వపు అధ్యక్షులు శ్రీ సి.హెచ్. దామోదర్ రావు గారు ,రాష్ట్ర సేవాదళ్ సమన్వయకర్త శ్రీ సుబ్బారావు గారు ,రాష్ట్ర గ్రామ సేవ ఇంచార్జ్ శ్రీ సత్యనారాయణ గారు రాష్ట్ర యువజన సహా సమన్వయకర్త శ్రీ కళ్యాణ గారు రాష్ట్ర ఐటీ సమన్వయకర్త శ్రీ కిషోర్ గారు కలసి వార్షిక ప్రణాళికను విడుదల చేయడం జరిగినది.
తదుపరి రాష్ట్రఅధ్యక్షులు తమ ఉపన్యాసాన్ని భక్తుల మనోభావాలు తగ్గట్టు ఉపన్యసించి భక్తులను ఉత్తేజపరిచారు. వారి ప్రసంగానంతరం మిగిలిన అతిధులు ప్రసంగించడం జరిగింది.
వక్తలు ఉపన్యాసం అనంతరం గతంలో జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలో జిల్లాస్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పిల్లలకు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మిగిలిన అతిధులు చేతుల మీదుగా మేమొంటోలు, ప్రశంసా పత్రములు మరియు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
పాలకొండ శ్రీ సత్య సేవా సమితి బాలవికాస్ పిల్లల చే రెండు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి 16 సమితిలు నుండి 79 భజన మండలి నుండి సుమారు 500 మంది భక్తులు హాజరైరి. స్థానిక సమితి కన్వీనర్ శ్రీ సుధాకర్ రావు గారు ఓటర్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది.చివరగా రాష్ట్ర అధ్యక్షులు వారు స్వామివారికి హారతి సమర్పించడంతో కార్యక్రమం ముగిసినది.
జై సాయిరాం!
