NTR Dt._AP STATE COORDINATORS, STATE INCHARGES & DISTRICT PRESIDENTS MEETING
NTR District
DIST. LEVEL
06-Aug-2023
Spiritual Care
Others
06.00.00
SEETHARAMPURAM, VIJAYAWADA
BALA PAVAN KUMAR
9426612394
ssssontr@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం సీతారాంపురం సమితి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా 06 Aug 2023 శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం నాడు విజయవాడ సీతారాంపురం సమితి భవన సముదాయము నందు జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు గారిచే శ్రీ సత్యసాయి సేవా సంస్థల పతాక ఆవిష్కరణతో కార్యక్రమం మొదలైనది. రాష్ట్రస్థాయి పదాధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమితి స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు, బాలవికాస్, స్వామి 100వ పుట్టినరోజు పండుగకు చేపట్టిన కార్యక్రమాలు వంటివి సమీక్షించబడినాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ కొమరగిరి శ్యాం ప్రసాద్ గారి చే రూపుదిద్దుకున్న సత్యసాయి సందేశము- ప్రగతికి సంకేతము అను information booklet స్వామి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా విడుదల చేయబడినది. సాయంత్రం వేళ, శ్రీ సత్య సాయి పూర్వ విద్యార్థులు నిర్వహించే సమర్పణ్ కార్యక్రమం కూడా ఎంతో ఆనందంగా సాగింది. బెంగళూరు ఈస్ట్ జిల్లా అధ్యక్షులైన శ్రీ కె వి ఎస్ ఎన్ మూర్తి గారు, లండన్ రీజియన్ -2 ఆధ్యాత్మిక సమన్వయకర్త అయిన శ్రీ నాగ సాయి ప్రసాద్ శ్రీపాద గారు తమ ప్రసంగాన్ని భజనలతో కలగలిపి వీనులవిందు గావించారు. ఆధ్యంతం సీతారాంపురం సమితి సమన్వయకర్తలు, కన్వీనర్, రవాణా వసతి సదుపాయంలో యువత, భోజనాది వ్యవహారాలలో మహిళా విభాగం వారి పూర్తిస్థాయి నిమగ్నంతో కార్యక్రమం జయప్రదంగా జరిగింది. సదా శ్రీ సాయి సేవలో
