Back

సేవాదళ్ శిక్షణా శిబిరం - తాడేల్లిగూడెం


District:  
West Godavari
Samithi:
Tadepalligudem
No Of Beneficiaries:
235
Event Date:
27-Aug-2023
Event Category:
Spiritual Care
Event Sub Category1:
Others
No Of Hours:
04:00::00
Location:
Sri Satyasai Seva Samithi, Tadepalligudem
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరామ్
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పశ్చిమగోదావరి జిల్లా
 
తాడేపల్లిగూడెం లో  సేవాదళ్ శిక్షణా శిబిరం - ది. 27-08-2023
 
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 27-08-2023వ తేదీన శ్రీ సత్యసాయి సేవా సమితి, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లాలో సేవాదళ్ శిక్షణా శిబిరం నిర్వహించుట జరిగినది. 
సర్వధర్మ పతాక ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత, సేవాదళ్ శిక్షణా సదస్సుకు శ్రీ జంద్యాల నాగేశ్వరరావు గారు, జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ స్వాగతం చెప్పి సదస్సు ప్రారంభించారు. 
 
జిల్లా అధ్యక్షులు శ్రీ K.రవీంద్ర ప్రసాద్ సదస్సుకు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుల వారు  ఈ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర పదాతి కారులకు, జిల్లా పదాతికారులకు, వివిధ సమితులు మరియు భజన మండలుల నుంచి విచ్చేసిన పదాతి కారులు మరియు సభ్యులు అందరికీ ఆహ్వానం పలుకుతూ పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేసినటువంటి కార్యక్రమాల వివరాలు తెలియచేసి, వక్తలు చెప్పిన సూచనలు పాటిస్తూ స్వామి కృపకు పాత్రులు కావాలి అని కోరారు.
 
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ R.లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ ఓంకారం విశిష్టత, సుప్రభాతం, ప్రతి ఒక్కరూ చేయాలని దీనిని దినచర్యగా ప్రతి ఒక్కరూ ఆచరించుకోవాలని అన్నారు. ఆధ్యాత్మిక సాధన, సాయి సందేశ వ్యాప్తి, సంస్థ సేవలను విస్తృతం చెయ్యాలని చెప్పారు.  ఈ అంశాలు ప్రతి సమితి సభ్యుడు కలిగి ఉండాలని అన్నారు.
 
శ్రీమతి కే.కిరణ్ కుమారి గారు, రాష్ట్ర మహిళా విభాగ కోఆర్డినేటర్ సంస్థలో మహిళల ప్రాధాన్యతను వివరించి యువత చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించమ న్నారు.  స్వామి సేవల లో ఎలా తరించాలి, ప్రశాంత సేవల ప్రాముఖ్యత విశిష్టతలను వివరించారు.
 
రాష్ట్ర మెడికల్ సమన్వయ కర్త శ్రీ సాయి కృష్ణ గారు మాట్లాడుతూ పుట్టపర్తిలో ఇప్పటివరకు 40 లక్షల రోగులకు ఓపి చేయడం జరిగింది నాలుగు లక్షల ఆపరేషన్లు అయినాయని దీని విలువలు సుమారుగా 3500 కోట్లు విలువని అన్నారు. సమితి, భజన మండలిల సారధ్యాలను యువతకు అప్పగించాలని అన్నారు. సత్యసాయి మందిరాలలో బీపీ మిషను, ఈసీజీ  వసతులు ఏర్పాటు చేయమని కోరారు.
 
రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ch.సురేంద్ర గారు మాట్లాడుతూ సంస్థకు సేవలు చేయడం అదృష్టంగా భావించి సేవా కార్య్రమాల్లో పాల్గొనాలి అని అన్నారు. 
 
M.N.S.K.జనార్దన్ రావు గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ సదస్సులో అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
 
సమితి ఆధ్యాత్మిక విభాగం కోఆర్డినేటర్ వందన సమర్పణ చేశారు.
 
ఈ కార్యక్రమంలో 235 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. వారికి సేవాదళ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. శిక్షణా శిబిరంలో ప్రత్యేకంగా యువత ఆధ్వర్యంలో సాయికనెక్ట్ యాప్ సేవలు నిర్వహించుట జరిగినది. 
 
తదనంతరం స్వామి వారికి మహా మంగళ హారతి తో కార్యక్రమం ముగిసింది.
 
జై సాయిరాం








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved