Sadhana Camp - Jagannadhapuram
West Godavari
Jagannadhapuram
01-Oct-2023
Spiritual Care
Sadhana Camp
05:45:00
Sri Satyasai Geethamandiram, Jagannadhapuram
V Satish Kumar
6300893488
wgssssoap@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరామ్
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పశ్చిమగోదావరి జిల్లా జగన్నాధపురం లో సాధనా శిబిరం - ది. 01-10-2023
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 01-10-2023 వ తేదీ, ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం subzone లో శ్రీ సత్యసాయి గీతాకృష్ణ మందిరం, జగన్నాధపురం నందు శ్రీ గాదె శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యక్షతన *సాధనా శిభిరం* నిర్వహించుట జరిగినది.
ఉదయం 9:30 గంటలకు జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి గౌరి కవిత గారిచే జ్యోతి ప్రజ్వలన మరియు వేద పఠనం తో కార్యక్రమం ప్రారంభమైనది. శ్రీ *వి. మోహనరావు* గారు వక్తలను వేదిక పైకి ఆహ్వానించారు. *జిల్లా అధ్యక్షులు శ్రీ కె. రవీంద్ర ప్రసాద్ గారు* మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో ఒకొక్క మెట్టు పైకి ఎక్కాలి అని, నామ సంకీర్తన, సేవల ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి అని నిత్యకృత్యం లో ఒక అరగంట ఐనా సంకీర్తనలో గానీ, సేవలో గానీ పాల్గొనాలి అని, నాది అనే భావన వీడి మనది అనే భావనకు రావాలి అని, టెలివిజన్ కు దూరంగా ఉండాలి అని సూచించారు.
జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ *శ్రీమతి గౌరి కవిత* గారు ఓంకారము గురించి చెపుతూ అకార, ఉకార,మకారాల సమ్మేళనం ఓంకారము అని, ఉదయం 21సార్లు ఓంకారం పటించుటవలన కలిగే ప్రయోజనాలు తెలియచేశారు. సుప్రభాతం, నగర సంకీర్తనల విశిష్టతలను తెలియచేశారు. జ్యోతి ధ్యానము గూర్చి మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాసే ధ్యానము అని, జ్యోతిని అవయవాలలోకి ప్రసరింప చేయటమే జ్యోతి ధ్యానము అని practical గా చేయించారు. శ్రీ సత్యసాయి యువత, వారి బాధ్యతలు మరియు నిర్వహణ గురించి శ్రీ *టి. శోభనాద్రిరావు* గారు మాట్లాడుతూ యువత భావిభారత పౌరులు అని, నాయకత్వాన్ని పహించవలసిన వాళ్ళు అని తెలుసుకోవాలి అని చెప్పారు. సత్యం నోటి ద్వారా, ధర్మం ఆచరణ ద్వారా పాటించాలి అని తల్లిదండ్రులను గౌరవించాలి అని తద్వారా వృద్ది లోకి వస్తారు అని , భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచించాలి అని తెలియ చేశారు
శ్రీ *బందా శ్రీనివాసరావు* గారు మాట్లాడుతూ నామసంకీర్తన జరిగే చోట భగవంతుడు ఉంటాడు అని, సాయిరాం అంటే లేనిది కూడా వచ్చి తీరుతుంది అని, తల్లి తండ్రులు మొదలుకొని పరమాత్ముని వరకు సేవ చేయాలి అని కోరారు.
సాయంత్రం 3:00 గంటలకు వందన సమర్పణ తదనంతరం స్వామి వారికి మహా మంగళ హారతి తో ఈ కార్యక్రమం ముగిసినది. ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు, తాడేపల్లిగూడెం subzone పరిధిలోని సమితి కన్వీనర్లు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు.
జై సాయిరాం
