Back

SDP 3rd batch training conclusion


District:  
Krishna
Samithi:
Machilipatnam
Event Date:
18-Mar-2024
Event Category:
Socio Care
Event Sub Category1:
Vocational Training
Event Sub Category2:
Tailroing, Embroidery, Beautician , Maggam
No Of Hours:
1 hour
Location:
machilipatnam
Reported By:
narendra
Mobile No:
8639308099
Email Id:
narendrabandaru99@gmail.com



Description:

ఓం శ్రీ సత్య సాయిరాం ,

శ్రీ సత్య సాయి మహిళా దినోత్సవం, శ్రీ సత్య సాయి ఉచిత ఉపాధి శిక్షణా కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న, కుట్టు మిషన్ 3 బ్యాచ్ ముగింపు సమావేశం, ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడమైనది. కార్యక్రమమునకు ముందుగా, జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త, శ్రీమతి డి సాయి జ్యోతి, స్వామివారికి పుష్పమాలను వేయగా, జిల్లా సేవాదల సమన్వయకర్త, శ్రీమతి డి.శిరీష, సాయి జ్యోతులు జ్యోతి ప్రజ్వలనము చేసిరి. అనంతరం, నూతన పల్లకిలో, స్వామివారి పల్లకి మహోత్సవము, మంగళ వాయిద్యములు సాయి గాయత్రీ తో నిర్వహించరి. శ్రీ సత్యసాయి మహిళా విభాగం వారిచే, లలితా సహస్రనామ పారాయణ, అనంతరం, శ్రీ సత్య సాయి ఉచిత ఉపాధి శిక్షణ కేంద్రం మూడో బ్యాచ్ ముగింపు సమావేశం, బ్యాంక్ ఆఫ్ బరోడా, సీనియర్ మేనేజర్, శ్రీమతి కె కళ్యాణి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ పొందిన వారు కుట్టిన డ్రెస్సులను తిలకించి ఆనందించిరి. అనంతరం, నేర్చుకున్న ప్రతి ఒక్కరూ అనుభవాలను అనుభూతులను తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, శ్రీ కొమరగిరి చంద్రశేఖర్,, జిల్లా పదాధికారులు ఇరువురు, సమితి కన్వీనర్లతోపాటు, అతిధి సీనియర్ మేనేజర్ గారు ప్రసంగించారు. అనంతరం, ఒక్కరోజు మానకుండా వచ్చినటువంటి  ఐదుగురికి స్వామి వారి దివ్య ప్రసాదం, బహుమతులను అందించిరి. అనంతరం, ఒక విద్యార్థికి, ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఇందులో శిక్షణ పొందిన మహిళ వారి కుమార్తె  చే కూచిపూడి నృత్యం చేయించగా, ఈరోజే వివాహ ది దినోత్సవం జరుపుకుంటున్న, జంటచే కేక్ కట్ చేయించి వేద ఆశీర్వాదం అందించరి. అనంతరం శిక్షకు రాళ్ల అందరికీ, మహిళా విభాగం వారు పసుపు కుంకుమలు అందించరి. అనంతరం మహా మంగళ హారతి తో కార్యక్రమం ముగించడమైనది. ఎంతో అద్భుతంగా వైభవంగా మా చే ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేసిన స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ... స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు... మనందరిపై నిండుగా దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ....

కన్వీనర్,శ్రీ సత్య సాయి సేవా సమితి,మచిలీపట్నం, కృష్ణాజిల్లా.

 

 

 

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved